
Trinethram News : హైదరాబాద్ పా తబస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలోకి రానున్నది. ఈ మేరకు దేవాదాయ శాఖను ట్రిబ్యూనల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాసు, మహంత్ రాంచంద్రదాసు 19 60 దశకం నుండి చూస్తున్నారు. ఇప్పుడు నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆలయానికి తక్షణమే ఈఓను నియమించి ఆలయంలోఎటువంటి అవకతవకలులేకుండా ముం దుకు వెళ్ళాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆలయ ఆదాయా న్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులపై కోర్టు విచారణ అనంతరం ఈ ఆదేశాలు జారీ అయినట్టు ఈ వర్గాలు తెలిపాయి.
1960వ దశకంలో చార్మినార్ వద్దనున్న అమ్మవారి ఆలయ పరిధిలో బస్సు ప్రమాదం జరగడంతో అమ్మవారి విగ్రహం కూలిపోయింది. స్థానిక భక్తులు విరాళాలు సేకరించి అమ్మవారి విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించారు. అంతకుముందు పోచమ్మ పేరుతో ఉన్న అమ్మవారి పేరును భాగ్యలక్ష్మీ గా మార్చినట్టు కథనం. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే మహంత్ రాంచంద్ర దాసు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్ మోహన్ దాసు అనే వ్యక్తిని పూజారిగా నియమించారు.
టెంపుల్ ట్రస్టీ మీద గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పు కారణంగా హెరిడెటరీ ట్రస్టీ ఆర్డర్స్‌తో ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకొని ఆదాయాన్ని రాజ్ మోహన్‌దాసు ఒక్కరే అనుభవిస్తూ వచ్చారు. దీనిపై మహంత్ రాంచంద్ర దాసు కుమార్తె భాగ్యలక్ష్మీ ఆలయం అజామాయిషీ చేస్తున్న వారిపై కోర్టును ఆశ్రయించారు. కోట్లాది రూపాయాల ఆలయ నిధులను ప్రస్తుత నిర్వహకులు దుర్వినియోగం చేస్తున్నట్టు సాక్షాధారాలను కూడా ట్రిబ్యూనల్ దృష్టికి తీసుకెళ్లడంతో భాగ్యలక్ష్మి ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించాలని తీర్పు ఇచ్చినట్టు దేవాదాయశాఖ అధికార వర్గాల సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
