
Trinethram News : దేశవ్యాప్తంగా తనపై నమోదైన అనేక ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్‌లో కమెడియన్ సమయ్ రైనాకు చెందిన ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అలహాబాదియాపై దేశవ్యాప్తంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దీనిపై మంగళవారం సుప్రీం కోర్టు లో విచారణ జరిగింది.
జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. ఇటీవల ఒక టీవీ షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రణవీర్ అలహాబాదియా పై ధర్మాసనం సీరియస్ అయింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్ పోర్ట్ సరండర్ చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘మీరు చేసిన ప్రకటనలను సమర్థిస్తున్నారా … అశ్లీలత,అసభ్యత యొక్క పరిమితులు ఏమిటి… ఈ దేశంలో ఇది అసభ్యత కాకపోతే, మరి ఏమిటి.. మీరు ఉపయోగిస్తున్న భాషను చూడండి.. మీకు అన్ని రకాలుగా మాట్లాడటానికి లైసెన్స్ ఉందా…’’ అని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ప్రశ్నించింది. తల్లిదండ్రులను కూడా అవమానిస్తున్నారని, ఈ కార్యక్రమం ద్వారా ఈ వ్యక్తి మనసులో ఏదో మురికి ప్రచారం చేయబడిందని, కోర్టులు అతనికి ఎందుకు అనుకూలంగా ఉండాలని ధర్మాసనం ప్రశ్నించింది.
కాగావావివరుసలు, ఇంగితం లేకుండా తల్లిదండ్రుల గురించి అసభ్యకరమైన (ప్రచురించటానికి వీలు లేని) భాషలో మాట్లాడిన రణ్‌వీర్ అలహాబాదియా.
అతడి మాటలను ఈసడించుకుంటూ, తీవ్రమైన కామెంట్లు పెడుతూ.. అతడి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ చానళ్ల నుంచి వైదొలుగుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
