TRINETHRAM NEWS

Trinethram News : ఎర్రవల్లి:- దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీచుపల్లి పుణ్యక్షేత్రంలో సౌకర్యాలు నిల్.. వసూళ్లు ఫుల్ అన్నట్లుగా బీచుపల్లి పుణ్యక్షేత్రం లో ఉంది.దేవాలయాల దర్శనం కోసం వచ్చే భక్తులకు స్థానిక అర్చకుల వసూళ్లతో దేవుని దర్శనం మహా భాగ్యం అన్నట్టుగా డబ్బుల వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారని బీచుపల్లి ఆలయానికి వచ్చే భక్తులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు మరణించిన వాకి హస్తికలు పవిత్ర కృష్ణనదిలో కలవడం కోసం రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి పుణ్యక్షేత్రం కు వస్తుంటారు. ఏ పుణ్యక్షేత్రాలలో అయినా ప్రత్యేక పూజలు చేయించాలంటే ప్రభుత్వం ఫిక్స్ చేసిన రుసుము చెల్లించి రసీదు తీసుకున్న తర్వాత అక్కడి పూజారులు పూజలు చేస్తారు.

కానీ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ప్రభుత్వం చెప్పింది నడవదు. ఇక్కడి పంతులు చదివిందే మంత్రం అడిగినంత ఇవ్వాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టెడు దుఖం తో వచ్చే భక్తుల నుంచి పూజారులు రకరకాలుగా పూజలు చేయాలని ఎక్కడా లేని విధంగా పూజలు చేస్తూ రెండు నిముషాలలో చదివే మంత్రాలకు 2 వేల నుంచి 5 లేదా 10 వేల వరకు వసూలు చేస్తూ భక్తులను బలవంతంగా పీడించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇక్కడ ఇంతే ఎవరికైన చెప్పుకోండి అనే విధంగా అయ్యవార్ల అనుచరులు ప్రవర్తిస్తున్నారని భక్తులు బహిరంగముగా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

ఇంత అధిక వసూళ్ల దందా జరుగుతున్నప్పటికీ ఆలయ కమిటీ చైర్మన్ గానీ, ప్రభుత్వ అధికారులు గాని పంతులపై చర్యలు తీసుకోక పోవడం విడ్డూరంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీచుపల్లి లో ఐదు రకాల పూజల వసూళ్ల పై రాష్ట్ర దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని సోమవారం హస్తికలు కలపడం కోసం వచ్చిన భక్తులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అలాగే గతంలో పుష్కరాల సమయంలో నిర్మించిన బాత్ రూమ్స్, టాయిలెట్స్ కు తాళాలు వేశారు. దీనిపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.