మంత్రి కొల్లుకు బీసీమత్స్యకార నేత రట్టి అప్పన్న అభినందనలు
Trinethram News : రాజమండ్రి, ఫిబ్రవరి 3:రాష్ట్ర భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర మత్స్యకారుల సమాఖ్య అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షులు,రాష్ట్ర వెనకబడిన తరగతుల సంఘం అధ్యక్షుడు రట్టిఅప్పన్నమర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రట్టి అప్పన్న బీసీల, మత్స్యకారుల సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు.దీనికి స్పందించిన మంత్రి కొల్లు రవీంద్రమాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఎంతోముందుచూపుతోసంక్షేమం,అభివృద్ధి,ఉపాధి అవకాశాలను అందించారనిపేర్కొన్నారు.
బిసిలకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అన్ని హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడు మెరుగైన జీవనోపాధిపొందా లని, చదువుతోపాటు ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు సాగాలని సూచించారు.ప్రతి మత్స్యకార కుటుంబాలకు సంక్షేమం, అభివృద్ధి,ఉపాధి అవకా శాలను ప్రభుత్వం కల్పించడం జరుగుతుందని మంత్రి అన్నారు.రట్టి అప్పన్న మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App