
ఈనెల 22 (నాలుగో శనివారం) 23 (ఆదివారం) 24, 25 బ్యాంకుల సమ్మె..
Trinethram News : బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు. విఫలమవడంతో బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మెతో భారత ఆర్థిక రంగం స్తంభించిపోనుంది ఈ సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకు సిబ్బంది కూడా పాల్గొననున్నారు.
అయితే వచ్చే వారంలో బ్యాంకుల సమ్మె అయినప్పటికీ ముందు నుంచే అంటే మార్చి 22 నుంచే బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. మార్చి 22న నాల్గవ శనివారం, తరువాత ఆదివారం బ్యాంకులకు సెలవులు. ఆపై మార్చి 24, 25 (సోమ, మంగళవారం) బ్యాంకుల సమ్మె నేపథ్యంలో దాదాపు నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
