TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 12 : ప్రతి విద్యార్థిని టీచర్ తన సొంత పిల్లల్లా భావించి విద్య నేర్పాలని తద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.కెపిహెచ్బి కాలనీ ఫంక్షన్ హాల్ దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేసిన సునీత మెగా స్కూలును రమేష్, కూకట్పల్లి ఏసిపి శ్రీనివాస్ రావు తో కలిసి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యా ప్రమాణాల్లో మార్పులు వస్తున్నాయని వాటిని అందిపుచ్చుకొని విద్యార్థులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠ శాల ప్రతినిధులు సునీత, విజయలక్ష్మీ, శివ చౌదరి, నలినీకాంత్, గోవిందు, అస్లాం ,ఫణి కుమార్, అశోక్, జ్యోతి, సంధ్య ,రజిత తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandi Ramesh, who started