TRINETHRAM NEWS

అయ్యన్నకు లేని నిబంధనలు, ఆదివాసీలకా? ఆదివాసీ జేఏసీ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : అయ్యన్నకు లేని నిబంధనలు ఆదివాసీలకా?:ఆదివాసీ జెఎసి. అయ్యన్నకు లేని నిబంధనలు ఆదివాసీలకా అని, ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఎసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదివాసీలను అవమాన పరుస్తూ,ఆదివాసీల భూముల రక్షణ కౌవశమైన 1/70 భూబదాలయింపు నిషేధచట్టాన్ని సవరించాలన్నారు.

ఆయన వ్యాఖ్యలు సమర్ధనీయమేనని కొంతమంది ఆదివాసేతరులు బహిరంగంగా మాట్లాడితే లేని నిబంధనలు,ఆదివాసీలు రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్ ప్రకటిస్తే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమలులో ఉందని,కోడ్ ని ఉల్లంఘిస్తే కేసులు పెడతామని పోలీసులు బంద్ నిర్వహులకు నోటీసులు ఇచ్చి భయపెట్టడం సమంజసం కాదని,ఈ దేశ మూలవాసులైనా ఆదివాసీలమీద,ఆదివాసీల చట్టాల మీద నోరు పారేసుకున్న అయ్యన్న పాత్రుడు మీద సుమోటా గా కేసు పెట్టండని పోలీసులకు రాజబాబు సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App