TRINETHRAM NEWS

అట్టహాసంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దోమ.ఆదివారం దోమ -తిమ్మాయిపల్లి ఎస్ జి గార్డెన్ లో 1996-97 బ్యాచ్ పదవతరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది ముప్పై ఏళ్ళ కిందట దోమ జిల్లా పరిషత్ పాఠశాల లో కలిసి చదువుకున్న విద్యార్థి విద్యార్థునులు తమకు విద్యను బోదించిన ఉపాధ్యాయ వర్గం తో ఏర్పాటు చేసుకున్న ఈవెంట్ లో వారి పాఠశాల లో చదివిన రోజుల తీపి స్మృతులు ప్రస్తుతం వారి జీవన పరిస్థితులు ఒకరికొకరు పంచుకొన్నారు విశ్రాంత ఉపాధ్యాయులు సైతం అప్పట్లో పాఠశాల బోధన తదితర పరిస్థితులు తమ విద్యార్థులకు తెలిపారు భవిషత్తు అనేది ముళ్లతో కూడుకున్నది అని కష్టం ఫలితం పొందాలంటే ప్రతి రోజు పనిలో ఉండాల్సిందే అని ఇంచార్జి విద్యాధికారి శశిధర్ పలువురు విశ్రాంత ఉపాధ్యాయులు శేషయ్య బుచ్చిరెడీ మల్లయ్య బుర్రనొద్దీన్ ప్రమోద్ కుమార్ రెడ్డి మహేందర్ లు అన్నారు.తీపి గుర్తులతో ఆహ్లాదాం.. కె.రాజిరెడ్డి
విద్యార్థి దశ తీపి గుర్తులు విరామ సమయంలో ఆహ్లాదా న్ని పంచుతాయి అని దోమ సర్పంచుల సంగం మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు వెళ్లి సమ్మేళనం జరుపుకుంటున్నపూర్వ విద్యార్థి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థుల ఈవెంట్ నిర్వాహకులు దోమ బిఆరెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ కోర్ట్ ఉద్యోగి మహిపాల్ గౌడ్ రాఘవందర్ రావు సంతోష్ శేఖర్ పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు శాలువా మెమంటోపూల మాలలతో ఉపాధ్యాయ వర్గాన్ని సత్కరించారు పూర్వ విద్యార్థులందరు మెమంటోలు అందుకున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App