TRINETHRAM NEWS

కేపీహెచ్ బీ హాస్టల్ లో కడప కుర్రోళ్ల దాడి

Trinethram News : Medchal : కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో హాస్టల్లో దారుణం జరిగింది. ఓ హాస్టల్లో ఉంటున్న వ్య క్తిపై అనవసరంగా దాడి జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కడప జిల్లా నుంచి వచ్చిన ఓ యువతి.. ముగ్గురు యువకులు ధర్మారెడ్డి కాలనీలో ఓ హాస్టల్ వద్దకు వచ్చి వరప్రసాద్ అనే వ్యక్తిపై దాడి చేశారు. అయితే ఆయనపై ఎందుకు దాడి చేశారో తెలియరాలేదు. అక్కడ వరప్రసాద్ అనే వ్యక్తులు ఇద్దరు ఉంటున్నారు. వారు దాడి చేయాలనుకున్న వరప్రసాద్ పై కాకుండా మరో వరప్రసాద్ పై దాడి చేశారు.

బాధితుని పెదవులకు… దవడ ప్రాంతాల్లో గాయాలయ్యాయి. ఈ దాడి ఘటనను గాలి వరప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు వారు ఎందుకు దాడి చేయాలనుకున్నారో ఇంకా తెలియరాలేదు. నిందితులను పట్టుకున్న తరువాత పూర్తి వివరాలు చెబుతామని పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించి దృశ్యాలు సీసీ కెమేరాలో రికార్డయ్యాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App