TRINETHRAM NEWS

Trinethram News : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అరంగేట్ర పేసర్ అశ్వని కుమార్(4/24) నిప్పులు చెరిగాడు.

దాంతో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 16.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26), రమణ్‌దీప్ సింగ్(12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ముంబై బౌలర్లలో అశ్వని కుమార్‌తో పాటు దీపక్ చాహర్(2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విజ్ఞేష్ పుతుర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.

తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానేను ఔట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన అశ్వని కుమార్.. తన రెండో ఓవర్‌లో డేంజరస్ రింకూ సింగ్‌తో పాటు మనీష్ పాండేను పెవిలియన్ చేర్చాడు. రింకూ సింగ్‌ను క్యాచ్ ఔట్ చేసిన అశ్వని కుమార్.. మనీశ్ పాండేను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక తన మూడో ఓవర్‌లో విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో అరంగేట్ర ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ashwani Kumar on fire