TRINETHRAM NEWS

ఆశా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 03 ఏప్రిల్ 2025. వరంగల్ డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం ముందట ధర్నా ఆశాలకు గత మూడు సంవత్సరాల నుండి బకాయిలు ఉన్న లెప్రసీ, పల్స్ పోలియో, టిబి క్యూర్ పారితోషికాలు చెల్లించాలని సిఐటియు ఆద్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ ముట్టడి కార్యక్రమానికి ఆశా జిల్లా అద్యక్ష, కార్యదర్శులు చిన రాణి, సీనపెల్లి చైతన్య అద్యక్షత వహించగా ఆశా వర్కర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి మాట్లాడుతూ… వరంగల్ జల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు మాతా శిశు మరణాలు తగ్గించడం, ప్రజలకు ఆరోగ్య సంరక్షణా సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటుగా క్షయ, లెప్రసీ నివారణా, పల్స్ పోలియో కార్యక్రమంలో ముందుండి అంకిత భావంతో పనిచేస్తున్నారన్నారు.

ఆశాల చేత ప్రభుత్వం లెప్రసీ, పల్స్ పోలియో, టి.బి నివారణ, కార్యక్రమాలకు సంబంధించి గత 3 సంవత్సరాలుగా పని చేయించుకొని న్యాయంగా ఇవ్వాల్సిన పారితోషికాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేపించుకుంటుందన్నారు. పలు దఫాలుగా బాకాయి పారితోషికాలు చెల్లించాలని డి యం అండ్ హెచ్ ఒ వినతిపత్రాలు ఇచ్చామని అయినా సమస్య పరిష్కారం కానందున గత్యంతరం లేక ముట్టడి కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

సుమారు రెండు గంటలపాటు ఆఫీసు ముట్టడించాక సూపరింటెండెంట్ అనిల్ మరియు డిపిహెచ్ఎన్ఒ జ్ఞాన సుందరి ఆశాల వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించి పెండింగ్‌ పారితోషికాల ఫైల్ కలెక్టరు టేబుల్ మీద ఉందని, కలెక్టరు గారు అప్రూవ్ చేయగానే చెల్లిస్తామని హామి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి, ఆశా యూనియన్ కోశాధికారి సుజాత, ఉష, పద్మ, అన్నపూర్ణ, స్వరూప, శోభ రజిని, సుజాత, రత్నకుమారి, రజిత, రమ మల్లీశ్వరి, గీత, రాజేశ్వరి, సులోచన తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Asha's leprosy, pulse polio