TRINETHRAM NEWS

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుల అరెస్టు

1కిలో 232 గ్రామ్స్ ల గంజాయి స్వాధీనం

మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

నిందితుల వివరాలు

1.నక్క ప్రేమస్ s/o.సమ్మయ్య , వయసు.24 yrs, కులం : మాదిగ, వృత్తి.కూలి, R/o. కుచిరాజ్ పల్లి, మంథని

2.మొహమ్మద్ అర్శత్ S/o అమ్జద్ పాషా, వయసు.24 yrs, కులం : ముస్లిం, వృత్తి.బైక్ మెకానిక్, R/o. లక్కెపూర్, మంథని

స్వాధీనం చేసుకొన్నా వాటి వివరాలు

1232grams( 1kg 232 grams) గంజాయి కలదు. దాని విలువ Rs.30,800/

03 మొబైల్ ఫోన్ లు

వివరాల్లోకి వెళితే…

ఈ రోజు మంథని ఎస్ఐ రమేష్ నమ్మ దగిన సమాచారం మేరకు ఇద్దరు మగ వ్యక్తులు నిషేధిత గంజా అక్రమంగా కల్గి ఉన్నారని సమాచారం రాగా సిబ్బంది K.సంతోష్ కుమార్, D.రమేష్, CH.వెంకటేశ్వర్లు, D.అనిల్ కుమార్ లతో కలిసి మధ్యాహ్నం సమయం లో వెళ్లగా కుచిరాజ్ పల్లి గ్రామ శివారు లో గల బాలాజీ రియల్ ఎస్టేట్ ప్లాట్ నందు, గెస్ట్ హౌస్ వద్ద అనుమానాస్పదంగా వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదముగా చేతిలో నీలం రంగు కవర్తో తో కనిపించగా అట్టి వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకొని కవర్లో ఎమి ఉందని అడుగగా అందులో ఎండిపోయిన మొగ్గలు మరియు పువ్వులు గల గంజాయి ఉన్నది అని తెలిపినారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకోని పంచుల సమక్షంలో విచారించగా తన పేరు నక్క ప్రేమస్ s/o.సమ్మయ్య , వయసు.24 yrs, కులం : మాదిగ, వృత్తి.కూలి, R/o. కుచిరాజ్ పల్లి, మంథని అని తెలిపి, అతని వద్ద నీలం రంగు పాలిధిన్ కవర్ లో గల మరొక ముదురు నీలం రంగు కవర్లో గంజాయి ఉన్నదని, తనకు గత 5 సంవత్సరాల నుండి గంజాయి తాగే అలవాటు ఉందని, నాతో పాటు నా స్నేహితుడు అయిన లక్కెపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ అర్శత్ కి కూడా గంజాయి త్రాగు అలవాటు ఉందని, మేము ఇద్దరం పలుమార్లు కలసి గంజాయి కొనుక్కొని వచ్చి కొంత మేము తాగి, మిగిలినది చిన్న చిన్న పాకెట్స్ చేసి, ఒక్కోక్క ప్యాకెట్ ధర Rs.500/- కు అమ్మి డబ్బులు పంచుకునే వాళ్ళము అని, అందద ఇరువైరోజుల క్రిందట మేము ఇరువురము *సమీర్ R/o.యటపల్లి గ్రామం, సిరువంచ మండలం, మహారాష్ట్ర అను అతని వద్ద రెండు కిలోల గంజాయి ని కొనుక్కొని వచ్చి మా స్నేహితులైన రత్నబన్నీ, కళ్యాణ్, శివ మరియు రమేష్ లకు కొంత గంజాయిని అమ్మి, మిగిలిన గంజాయి మా వద్ద ఉంచుకొని అందులో కొంత మేము తాగుదామని, మల్ల ఎవరికైనా అమ్ముదామని వచ్చామని తెలిపారు. వెంటనే వారిని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిచడం జరిగింది అని సీఐ రాజు ఒక ప్రకటన లో తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App