వ్యూహం చిత్రంపై నేడు హైకోర్టులో వాదనలు
Trinethram News : హైదరాబాద్:
చర్చినియాంసంగా రూపొందిన వ్యూహం చిత్రంపై తెలంగాణ హైకోర్టులో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టులో ఇరువైపుల వాదనలు పూర్తి అయ్యాయి.
శుక్రవారం మధ్యాహ్నం తీర్పు ప్రకటించనుంది. ఒకవేళ ఈ రోజు తీర్పు వెలువరించకపొతే ఈ నెల 22న ప్రకటిస్తామని న్యాయ స్థానం పేర్కొంది.
కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీంతో సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. సినిమా విడుదల ఆగి పోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితుందని చిత్ర యూనిట్ వాదిస్తోంది. సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది.
ఈనెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపి వేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే…