
అల్లూరిజిల్లా అరకు నియోజవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 23: గత రెండు నెలల క్రితం అనంతగిరి మండలం పినకోట పంచాయితీలో బల్లగరువు నుంచి రాచకిలం గ్రామం వరకు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులు, ప్రజల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.ఆ గ్రామంలో జరిగిన సమావేశం అనంతరం తిరుగు ప్రయాణంలో స్థానికంగా ఉన్న ,కొరపర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడి భవనం పరిశీలించారు కొరపర్తి గ్రామ ప్రజలకు ఆయన మాట ఇవ్వడం జరిగింది, అనుకున్నదే తడువుగా వెంటనే గ్రామానికి పాఠశాలకు మధ్య సీసీ రోడ్డు నిర్మాణం పాఠశాల భవనం,ప్రహరీ, బోర్ వంటి అభివృద్ధి పనులు తన సొంత నిధులతో అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ ద్వారా అభివృద్ధి చేయిస్తున్నారు.
ఈ పనులు స్థితి సమీక్ష పరిసీలన కోసం,అరకువేలి నియోజకవర్గం ఇంచార్జీ చెట్టి చిరంజీవి, అనంతగిరి మండల జనసేన పార్టీ అధ్యక్షులు చిట్టం మురళి. ఈ మంగళ వారం 25.03.2025 తేదిన ఎస్. కోట,దేవరపల్లి ,జీనబాడు పంచాయితీ మీదుగా కొరపర్తి గ్రామానికి పర్యటన చేయనున్నారు. అందుబాటులో ఉన్న జనసైనికులు,మండల నాయకులు,వీర మహిళలు హాజరుకావాల్సిందిగా కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
