గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం.
అరకులోయ, త్రినేత్రం, న్యూస్ జనవరి 27.
అల్లూరిజిల్లా,అరకు నియోజకవర్గం కేంద్రంలో గళ సిఎహెచ్ పాఠశాలలో, అరకు నియోజకవర్గం శాసనసభ్యుడు రేగం మత్స్యలింగం,గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా నియోజకవర్గ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల కృషి ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. అలాగే బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిర్మించిన భారత రాజ్యాంగం ఈరోజు నుండే అమలులోకి వచ్చిందని అన్నారు.
భారత దేశ పౌరులందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని,ప్రతీ ఒక్కరూ బాధ్యతగా నడవాలని,మనం చేసే ప్రతీ పనిలో భారత జాతి మనుగడకు దేశభక్తి అవసరమని,గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు అరకువేలి జెడ్పీటీసీ శెట్టి రోషిణి, అశోక్,ఎంపీటీసీలు దురియా ఆనంద్,సమర్థి శత్రుగుణ,మండల నాయకులు, వైసీపీ నాయకులు అరకువేలి సూపర్ ఎంపీపీ జన్నీ నరసింహమూర్తి, కొత్తబల్లుగూడ సూపర్ ఎంపీటీసీ స్వాభిరామ్ మూర్తి, మండల ఎంఇఓ త్రినాధ్ , వైసీపీ మండల ఉపాధ్యక్షుడు జన్నీ అర్జున్, వైసీపీ నాయకుడు కొమ్మ పద్మనాభం, మరియు స్థానిక సిఎహెచ్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App