
అల్లురిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 21: అరకులోయ మండలం సుంకరమెట్ట పరిధిలోని వుడెన్ వాక్ బ్రిడ్జ్ ను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సందర్శించారు. పర్యాటకులు ఆంధ్రా ఊటీ అరకు సందర్శన కోసం ఏపీ టూరిజం శాఖ, ఆంధ్రప్రదేశ్ కాఫీ బోర్డ్ సంస్థ వారు నిర్వహించుచున్న వుడెన్ వాక్ బ్రిడ్జ్ పర్యాటకులను ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, మన గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి వినోదకరమైన వాటిని ఇంకా అభివృద్ధి పరిచి దృష్టి సారించాల్సిందిగా కోరడమైనది. ఇక్కడ విచ్చేసి సంత్రృప్తికరంగా ఆస్వాదించినట్టు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు.
ఈ సందర్భంగా అరకు కాఫీ బోర్డ్ వారు అరకు కాఫీని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కి రుచి చూపించడంతో. చాలా సంవత్సరాల నుంచి అరకు కాఫీని సేవిస్తున్నట్టు అద్భుతంగా ఉందని, కాఫీ పంటను మరింత అభివృద్ధి పరచాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలియజేశారు. అరకు కాఫీని మరింత అభివృద్ధి పరిచి అరకు కాఫీ గిరిజన రైతులను గిట్టుబాటు ధర కల్పించాలని కాఫీ బోర్డ్ అధికారులను కోరారు.
ఈ సందర్శనలో డుంబ్రిగుడ మండలం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురాం, డుంబ్రిగుడ మండలం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పాంగి నరసింగరావు, గారు, అధికారులు అరుణ (ఎఫ్ అర్ఒ), అప్పలరాజు (డీపీఏమ్) మరియు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్టసింగి విజయ్ కుమార్, కామేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
