TRINETHRAM NEWS

గురుకుల ప్రవేశ పరీక్ష కు దరఖాస్తు చేసుకోండి

తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న గురుకులలో 5 వ తరగతి మరియు 6వ తరగతి నుంచి 9వ తరగతి మిగిలిన సీట్ల కు ప్రవేశ పరీక్ష ను నిర్వహిస్తున్నాం అని VTGCET కన్వీనర్ శ్రీమతి అలుగు వర్షిణి ఐఏఎస్ ఒక ప్రకటన విడుదల చేశారు. కావున తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల గద్వాల్ ప్రిన్సిపాల్ కాశపొగు రాజు ఆదేశాల మేరకు మన ఐజ పట్టణం మరియు మండలంలో అర్హత గల పిల్లల తల్లితండ్రులు తమ పిల్లలను అప్లికేషన్ ను ఫిబ్రవరి ఒకటవ తేదీ లోపు గురుకుల వెబ్ సైట్ లో ఆన్లైన్ దరఖాస్తు చేయగలరు అని గద్వాల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గ్రంథపాలకుడు వి. ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్ష తేదీ ఫిబ్రవరి 23 న ఉంటుంది,ఎంపిక అయినా విద్యార్థులకి నాణ్యమైన ఉచితం విద్య, భోజన వసతి,దుస్తులు మరియు ఆంగ్ల విద్య అందిస్తామని అయన అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App