Another Rs.2500 crore for Visakha Steel
కేంద్ర ఉక్కు శాఖ ప్రకటన 2 బ్లాస్ట్‌ఫర్నేస్‌లను నడపండి, నవంబరు నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తికి ఆదేశాలు
Trinethram News : Andhra Pradesh : ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే గురువారం రూ.500 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మొదట విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు అప్పగించింది. తాజాగా ప్రకటించిన రూ.2,500 కోట్ల వినియోగంలోనూ ఎస్బీఐ కీలకంగా వ్యవహరించాలని సూచించింది.
ఈ నిధులు ఈ నెల 23వ తేదీ నాటికి అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చింది. స్టీల్‌ప్లాంటులో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉండగా ముడి పదార్థాల కొరత కారణంగా రెండింటిని మూసేసి, ప్రస్తుతం ఒక్క దాంట్లోనే ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు నిధులు అందుబాటులోకి వస్తున్నందున రెండు బ్లాస్ట్ ఫర్నేసులను పూర్తిస్థాయిలో నడపాలని ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అందుకు అవసరమైన ముడి పదార్థాలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. అన్ని విభాగాల్లోనూ నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు చేపట్టి అక్టోబరు చివరి నాటికి పూర్తిచేసి, నవంబరు నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తి చేయాలని కోరింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App