TRINETHRAM NEWS

APPSC DL Recruitment 2024: ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆయప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్‌ 2, గ్రూప్‌ 1, పాలిటెక్నిక్, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలవరించిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆయప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్‌ 2, గ్రూప్‌ 1, పాలిటెక్నిక్, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలవరించిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 11 సబ్జెక్టుల్లో 240 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు, విద్యార్హతలు, వేతనం, పరీక్ష విధానం వంటి తదితర వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌ లో జనవరి 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఈ పోస్టుల నియామకాలకు సంబంధించి అభ్యర్థులు ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో పేపర్‌ 1కు జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల్లో 150 మార్కులకు డిగ్రీ స్థాయిలో పరీక్ష ఉంటుంది. పేపర్‌ 2 పరీక్షకు సంబంధిత సబ్జెక్టు పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. అంటే ప్రతి తప్పు సమాధానానికి మైనస్‌ మార్కులు ఉంటాయని కమిషన్‌ పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సబ్జెక్టు వారీగా పరీక్షల సిలబస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. కాగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 47, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 99 లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.