
Trinethram News : భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది.
ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్ యుద్ధవిమానం (LCA) AF MK1 నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు DRDO ప్రకటించింది. 100 కి.మీ పరిధిలో పైలట్ కంటికి కనిపించని లక్ష్యాలను కూడా ఈ క్షిపణి సాయంతో ఛేదించవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
