
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ప్రీ ప్రైమరీ యాన్యువల్ స్పోర్ట్స్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఎంతో కోలాహలంగా స్పోర్ట్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే ఇలాంటి చక్కటి ఆటల పోటీలు వారి భౌతిక ఎదుగుదలను పెంపొందించేలా కృషి చేస్తాయని, కేవలం చదువుకు మాత్రమే పరిమితం కాకుండా చదువుతోపాటుగా, సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి ఆటలు అవసరమవుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో జోనల్ పిఈటి రాజేందర్ పాల్గొని, విద్యార్థులకు వివిధ ఆటల పోటీలను తానే స్వయంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి, శారీరక దృఢత్వానికి, ఆటలు అనేవి ప్రత్యక్ష సాధనాలని కొనియాడారు. తదనంతరం విద్యార్థులు వివిధ రకాల ఆటల పోటీలలో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకుని అందరిని అలరించారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు మరియు పాఠశాల డీన్ శ్యాంసుందర్, సి బ్యాచ్ ఇంచార్జ్ కిరణ్ మరియు ఇన్చార్జులు స్రవంతి, తస్లీమ్, వీరితోపాటు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
