Trinethram News : నెల్లూరు జిల్లా..
నెల్లూరు సిటీ ఎం.ఎల్.ఏ
2009 నుంచి మూడు సార్లు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశాను .. మొదటిసారి కొద్దిగా ఓడిపోయినా. రెండుసార్లు విజయం సాధించాను .. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాను .. కష్టకాలంలో నా వెంట ఉన్న వారి రుణాన్ని తీర్చుకోలేను .. జగన్ కోసం సైనికుడిలా పని చేస్తా
ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా .. రేపు నరసరావుపేటకు వెళుతున్నా ..అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ నాకు సన్నిహితులే .. అంతా కలిసికట్టుగా పని చేస్తాం ..
ఈ ప్రాంతం అన్నీ నాకు ఇచ్చింది.. వీరి దీవెనల వల్లే నరసరావుపేటలో కూడా రాణిస్తా .. నాకు ఎవరి మీదా కక్ష్య లేదు .. కొన్ని మీడియా లలో నాకు వ్యతిరేకంగా రాశారు .. అయినా నేను ఎవరి మీదా బాధ పడను ..నాకు ఎందరో సహకరించారు ..నెల్లూరు సిటీకి అభ్యర్థిగా మైనారిటీ కి జగన్ అవకాశం కల్పించారు
ఒకరిద్దరు నాయకులు వెళ్లినా ఇబ్బంది లేదు .. పార్టీ ఏమీ బలహీన పడదు ..కొత్త వారిని తీసుకు వస్తాం .. నేత మారినప్పుడు కొందరు వెళ్లడం సహజమే ..నెల్లూరు వదిలి వెళుతున్నందుకు బాధగా ఉన్నా….రెండు జిల్లాలు దాటి వెళుతున్నా .. జగన్ నన్ను పోటీ చేయమని చెప్పారు
ఎవరికీ దొరకని అవకాశం నాకు లభించింది .. రేపు సాయంత్రం నరసరావుపేట లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటా .. జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు బాధను కలిగించాయి ..నాలుగున్నర ఏళ్లు జగన్ దేవుడు ఇలా కనిపించారు .. జగన్ వల్లే పదవులు పొంది ఎదుగుతారు .. పార్టీని వాటిని వీడేటప్పుడు మాత్రం ఎన్నారో పనులు చేస్తున్నారు
వైసీపీ 2014లో జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇచ్చింది .. అక్కడ ఓడిపోతే ఎంఎల్ సి పదవిని ఇచ్చారు
జగన్ ఏమి చేయలేదో చెప్పాలి ..నరసరావుపేట నుంచి ఎం.పి.గా పోటీ చేయమని కృష్ణ మూర్తి కి కూడా చెప్పారు .. ఆయన .. కాదన్నప్పుడే నాకు అవకాశం ఇచ్చారు .. టిడిపి ఎంతమంది బీసీ నేతలకు టికెట్లు ఇచ్చిందో చూడాలి ప్రకాశం.. నెల్లూరు.. తిరుపతి జిల్లాల్లో బి.సి.లలో ఎవరికైనా టిడిపి టికెట్ ఇచ్చిందా
జగన్ ద్వారా బాగా సంపాదించుకొని మళ్లీ ఆయన ను విమర్శించడం ఫ్యాషన్ గా మారింది .. చంద్రబాబు పంపించిన స్క్రిప్ట్ ని చదువుతున్నారు ప్రజలంతా చూస్తున్నారు 2024లో జగన్ ను గెలిపిస్తున్నారు జగన్ ను నిజంగా అభిమానించేవారు పార్టీ మారరు ఫెక్ లే పార్టీ మారుతారు తాను చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా జగన్ కప్పాలని బహిరంగంగా చెప్పిన నేత పార్టీ మారారు అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుంది జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారు నెల్లూరు సిటీ నుంచి వై.సి.పి.అభ్యర్థిగా ఖలీల్ పోటీ చేస్తారు.