TRINETHRAM NEWS

AP Anganwadi Protest : ఏపీలో అంగ‌న్ వాడీల ఆందోళ‌న..16వ రోజుకు చేరుకున్న పోరాటం

AP Anganwadi Protest : అమ‌రావ‌తి – త‌మ న్యాయ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగ‌న్ వాడీలు చేప‌ట్టిన ఆందోళ‌న బుధ‌వారం నాటితో 16వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఎమ్మెల్యేల ఇళ్ల‌ను ముట్టడించే కార్య‌క్ర‌మం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ప‌లు ప్రాంతాల‌లో అంగ‌న్ వాడీల‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

AP Anganwadi Protest Viral
గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌మ‌కు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని, రూ. 26 వేలు పెంచుతామ‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan) హామీ ఇచ్చార‌ని నాలుగున్న‌ర ఏళ్లు పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసిన పాపాన పోలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు అంగ‌న్ వాడీలు.

ఇదిలా ఉండ‌గా అంగ‌న్ వాడీల త‌ర‌పున ప్ర‌భుత్వంతో జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. త‌మ డిమాండ్లు నెర‌వేర్చాల‌ని లేక పోతే స‌మ్మెను కొన‌సాగిస్తామ‌ని హెచ్చ‌రించారు. అయితే ఇప్ప‌టికే వేత‌నాలు పెంచామ‌ని, ఇప్ప‌ట్లో పెంచే ప‌రిస్థితి లేదంటూ స్ప‌ష్టం చేశారు ప్ర‌భుత్వం త‌ర‌పున ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.

తిరిగి చ‌ర్చ‌ల‌ను సంక్రాంతి పండుగ త‌ర్వాత పునః ప్రారంభిస్తామ‌ని, అంత వ‌ర‌కు అంగ‌న్ వాడీలు త‌మ ఆందోళ‌న‌ను విర‌మించాల‌ని సూచించారు. లేక‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.