TRINETHRAM NEWS

తేదీ : 28/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పయ్యావుల కేశవ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కె. పవన్ కళ్యాణ్ సమక్షంలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. బాల సంజీవని ప్లస్ కోసం రూ. 1,163 కోట్లు, మృత్యుకార భరోసా కోసం రూ.450 కోట్లు, యస్. సి,యస్. టి , బీసీ వర్గాలకు స్కాలర్ షిప్పుల కోసం రూ.337 కోట్లు, స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు, యస్.

సి, యస్. టి లకు ఉచిత విద్యుత్ కోసం రూ.400 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, పకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు రూ.62 కోట్లు, ధరల స్థికరణ నిధి కోసం రూ.300 కోట్లు. హంద్రీనీవా , ఉత్తరాంధ్ర, సృజన స్రవంతి, గోదావరి డెల్టా, కృష్ణ డెల్టా, ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 6,705 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం రూ. 2,800 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం రూ.500 కోట్లు కేటాయించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP State Budget allotment