TRINETHRAM NEWS

గ్రాసిమ్ నుండి ముడుపుల కోసమే అసెంబ్లీ వేదికగా క్యాన్సర్ ప్రచారం. -అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,

Trinethram News : గ్రాసిమ్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురిచేసి వారి నుండి ముడుపులు పొందడమే ధ్యేయంగా అసెంబ్లీ వేదికగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, లేవనెత్తిన క్యాన్సర్ అంశం బలభద్రపురం గ్రామానికి శాపంగా మారిందని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు
డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అన్నారు.

ఇటీవల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మాట్లాడినట్టుగా ముందే ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయించి అప్పుడు అసెంబ్లీలో క్యాన్సర్ విషయం ప్రస్తావిస్తే బాగుండేదని, అలా కాకుండా బలభద్రపురంలో నేను 200 మంది పైగా క్యాన్సర్ బాధిత కుటుంబాలను పరామర్శించానని చెప్పేవారని ఇందులో నిజం ఎంత ఉందో రామకృష్ణారెడ్డి గారికి తెలుసని, అయితే గ్రాసిమ్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేసి ముడుపులు గుంజాలనే ఆలోచనతో అసెంబ్లీలో ప్రస్తావన చేశారే తప్పా బలభద్రపురం పరిసర ప్రాంత ప్రజల క్షేమం కోరి కాదని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పేర్కొన్నారు.

అసెంబ్లీలో రామకృష్ణారెడ్డి, ఈ అంశం ప్రస్తావించడం, దానిపై మీడియా అత్యుత్సాహంగా ఈ క్యాన్సర్ అంశానికి విపరీతమైన ప్రచారం కల్పించడం, పత్రికలలో ఛానల్స్ లలో ప్రధాన వార్తగా ప్రచారం చేయడంతో ఈ ప్రాంతాన్ని క్యాన్సర్ భూతం కబళించిందేమో అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగిందని అన్నారు.

ఈ కల్పన ప్రచారంతో బలభద్రపురం గ్రామంతో పాటు, పరిసర గ్రామాలలో వారు బలభద్రపురం గ్రామంలో వారి చుట్టాల ఇంటికి రావటానికి కూడా భయపడి పోవడం, ఒకవేళ బంధువులు వచ్చినా కూడా కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా భయపడిపోతున్నారని అలాగే బలభద్రపురం అమ్మాయినైనా అబ్బాయినైనా పెళ్లి చేసుకుంటే క్యాన్సర్ తో మెట్టినింటికి వస్తారేమో అని బయట గ్రామాల ప్రజలు భయభ్రాంతులవుతున్నారు అని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

అంతేకాక ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో బలభద్రపురంలో సర్వే చేస్తుంటే ఆ సర్వే అధికారులను కూడా అదిరించి బెదిరించి విషయాన్ని పక్కదోవ పట్టించడంలో లేనిది ఉన్నట్లుగా చూపించాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు విఫలం అయ్యారని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అన్నారు.

బలభద్రపురం గ్రామంలో జరిగిన క్యాన్సర్ సర్వేలో జాతీయ సగటు క్యాన్సర్ శాతం కన్నా తక్కువ కేసులు నమోదు అయ్యాయని సాక్షాత్తు బీజేపీ కి చెందిన ఎమ్మెల్యే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, డి ఎం అండ్ హెచ్ ఓ అధికారులు ప్రకటించారని పేర్కొన్నారు.

డైవర్షన్ రాజకీయాలకు అలవాటు పడ్డ ఎమ్మెల్యే నల్లమిల్లి ఇంకా తన స్వతంత్ర సర్వే ఏదేదో అని సర్వే విషయాన్ని డైవర్షన్ చేయాలని చూస్తున్నారని ఏదేమైనా అధికారుల సర్వేతో నిజం బయటపడిందని గ్రాసిమ్ ఇండస్ట్రీ ఏర్పాటు సమయంలో జరిగిన విషయాలన్నీ ప్రజలకు తెలుసని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అన్నారు.

2019 వ సంవత్సరం ప్రధమార్ధం లోనే అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉండగానే కే.పి.ఆర్ సంస్థ నుండి గ్రాసిం సంస్థకు భూబదలాయింపు చేశారని అన్నారు.

ఆ తర్వాత వెంటనే దొంతమూరు లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అప్పటి మాజీ ఎమ్మెల్యే, ఇప్పటి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వారం రోజుల్లో భూ బదలాయింపు ఉత్తర్వులు రద్దు చేయించుకుని వస్తానని చెప్పి, ఎందుకు అప్పటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఈ భూ బదలాయింపు ఉత్తర్వులు రద్దు చేయించలేకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
ఇప్పటికైనా మించిందేదిలేదని గ్రాసిమ్ ఇండస్ట్రీ వలన ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఇప్పటికీ మీ ప్రభుత్వం అధికారంలో ఉందని మీకు చిత్తశుద్ధి ఉంటే ఇండస్ట్రీ పై తగిన చర్యలు తీసుకోవచ్చని, అంతేకానీ అవగాహన లేకుండా అసెంబ్లీలో విషయం ప్రస్తావించి బలభద్రపురం పరిసర ప్రాంతాలకు మాయన మచ్చ తీసుకువచ్చారని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Anaparthi MLA's zeal has