
త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు. బిక్కవోలు ఎంపీపీ ఎన్నిక ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య జరిగిన ఎన్నిక, ఎమ్మెల్యే నల్లమిల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బిజెపి ఎంపీపీగా తేతలి సుమ, ఏకగ్రీవంగా ఎన్నిక:ఎమ్మెల్యే, నల్లమిల్లి,
బిక్కవోలు యంపిపి గా బిజెపికి చెందిన తేతలి సుమ ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ…
బిక్కవోలు మండల ప్రజాపరిషత్ స్ధానానికి జరిగిన ఎన్నిక అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య జరిగిన ఎన్నిక,
తొమ్మిది మాసాల క్రితం అనపర్తి అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఎన్నిక కూడా అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య జరిగింది. తొమ్మిది మాసాల తర్వాత కూడా అదే విషయం ఇక్కడ రుజువైంది,
బిక్కవోలు మండల ప్రజాపరిషత్ లో గత మూడున్నరేళ్ళు దారుణమైన పాలన జరిగింది. రెండు జంటలు సాగించిన అహంభావ పాలనలో యంపిటిసిలను గానీ, సర్పంచ్ లను గానీ దారుణంగా అవమానింపబడి ఇబ్బందులు పడటం చూసాం. నాటి ఎమ్మెల్యే, దంపతులు, ఎంపీపీ దంపతుల అరాచకం నడచింది,
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ధానిక ప్రజా ప్రతినిధులను పార్టీతో సంబంధం లేకుండా గౌరవించడం జరుగుతూ వస్తుంది.
నాడు నరేంద్రమోడీ, సారధ్యంలో కేంద్రం స్ధానిక సంస్ధలకు ఇచ్చిన నిధులను జగన్ సర్కార్ ప్రక్కదారి పట్టిస్తే నేడు చంద్రబాబు, సర్కారు కేంద్ర నిధులను నేరుగా స్ధానిక సంస్ధల ఖాతాలో వేసి వాటిని బలపరుస్తూ వస్తుంది.
నేడు ఈ తొమ్మిది మాసాల పాలనలో నియోజకవర్గం నాలుగు మండలాలలోను దాదాపు 80 కోట్ల రూపాయిలతో అభివృద్ది పనులు చేసాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ది చేయడాన్ని సగర్వంగా చెపుతున్నాను.. గత ఐదేళ్ళు ఏం చేసారో చెప్పమని అడుగుతున్నా,
పదవులు ఉన్నాయనే అహంకారం తప్ప నాడు వైసిపి నాయకులు చేసిందేమీ లేదు. నేడు ఇంతమంది యంపిటిసిలు బిజెపిలోకి రావడానికి కారణం గత పాలకుల అహంకారాన్ని తుంచేయడం కోసమే,
వారంతా చెప్పిందొకటే.. అధికారం ఉన్నన్నాళ్ళు అనుభవించి ఇపుడు అది పోగానే నాయకత్వాన్ని వదిలేసే వారు మాకొద్దు. నిరంతరం ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించే నాయకత్వం మాకు కావాలి అని చెపుతున్నారు,
ఈరోజు వారంతా బిజెపిలో చేసి రాష్ట్రంలోనే బిజెపికి మొట్టమొదటి యంపిపి ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా,
ఈ గెలుపు కోసం కృషి చేసిన మండల, గ్రామస్ధాయి నేతలందరికీ ధన్యవాదాలు చెపుతున్నా,
బిక్కవోలు ఎంపీపీ గా తేతలి సుమ,కి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు.
బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ,కి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్,బిక్కవోలు మండల ఎంపీటీసీలు, అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు,కార్యకర్తలు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
