
తరనేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా, కేశవరం రైల్వే రోడ్డు ఓవర్ బ్రిడ్జి కోసం స్ధల సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రైల్వే మినిస్ట్రీ
అనపర్తి – బిక్కవోలు స్టేషన్ల మధ్య లక్ష్మీనరసాపురం దగ్గర మరో రోడ్డు ఓవర్ బ్రిడ్జి కోసం కూడా స్ధల సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
కేశవరం దగ్గర ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో దశాబ్దాల తరబడి ఇబ్బందులు పడుతున్న పలు నియోజకవర్గాల ప్రజలు
ముఖ్యంగా అనపర్తి, మండపేట, రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలకు అత్యంత అవసరం ఈ బ్రిడ్జి
ఆయన ప్రతిపక్షంలో ఉన్నపుడు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పడంలో కీరోల్ పోషించిన నేతలలో ఒకరు. అధికార వైయస్సార్ సిపి దౌర్జన్యకాండకు ఎదురొడ్డి నిలిచిన టాప్ 10 నాయకులలో ఆయనది ప్రత్యేక స్ధానం. ఆయనే అనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఎమ్మెల్యే,గా గెలిచిన నల్లమిల్లి ప్రతీరోజూ తన నియోజకవర్గ అభివృద్ది కోసం నిధులు ఎలా తీసుకురావాలి అనే తపన తప్ప మరో ఆలోచనలో ఉండదు. 2014 హయాంలో భారీ ఎత్తున నిధులు సాధించిన నల్లమిల్లి ఈసారి ఆ రికార్డులను క్రాస్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాడో ఏమోగానీ ఈ పర్యాయం ఆయన దూకుడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతుంది. నియోజకవర్గానికి ఈ 9 మాసాల టైమ్ లోనే కోట్ల రూపాయిల నిధులు తెచ్చిన ఆయన ఇపుడు రైల్వే రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు సాధించే పనిలో పడ్డారు.
అనపర్తి, మండపేట, రామచంద్రపురం తదితర నియోజకవర్గాల ప్రజలు కేశవరం మీదుగా రాజమండ్రి వెళ్ళాలంటే కేశవరం రైల్వేగేటు వద్ద నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కెనాల్ రోడ్డుకి ఆనుకుని ఈ రైల్వే గేటు ఉండటంతో తరచూ ట్రాపిక్ సమస్య కూడా జఠిలం అవుతుంది. దశాబ్దాల తరబడి ఈసమస్యకు పరిష్కారం లభించలేదు. ఇపుడు ఎమ్మెల్యే నల్లమిల్లి చొరవతో మోక్షం లభించింది.
ఇటీవల జిల్లాకు రైల్వే ఉన్నతాధికారులు విచ్చేసినపుడు జన్మభూమి ఎక్స్ ప్రెస్ హాల్ట్ కోసం అభ్యర్దించడానికి ఎంపీ పురంధేశ్వరి గారితో కలసి ఎమ్మెల్యే నల్లమిల్లి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా ఆయనకు కేశవరం రైల్వేగేట్ సమస్య స్పురణకు రావడంతో మండపేట ఎమ్మెల్యే,వేగుళ్ళ జోగేశ్వరరావు, అనుమతి తీసుకుని ఆ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది. దానితోబాటు అనపర్తి మరియు బిక్కవోలు మధ్య మరో ఆర్ ఓ బి అవసరం పై కూడా చర్చించడం జరిగింది.
నాడు ఎమ్మెల్యే ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ముందు ఉంచారు. తర్వాత ఎంపీ పురంధేశ్వరి గారితో కలసి డిల్లీ వెళ్ళిన నల్లమిల్లి ఆమె సహకారంతో కేంద్రంలో రైల్వే మంత్రిగారిని కలసి సదరు సమస్యని వారికి విన్నవించడం వారి నుండి సానుకూలత రాబట్టడం జరిగింది.
పిబ్రవరి 28 వ తేదీన రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేస్తూ రెండు రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిమిత్తం స్ధల సేకరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో నిధులు మంజూరు చేయనుంది
తన నియోజకవర్గ పరిధిలో ఉన్న లక్ష్మీవరసాపురం ఆర్ ఓ బి కి అలాగే తన నియోజకవర్గం కానప్పటికీ తన నియోజకవర్గ ప్రజలకే ఎక్కువ ఉపయోగపడే కేశవరం ఆర్ ఓ బి కోసం, ఎమ్మెల్యే నల్లమిల్లి చేసిన కృషి ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే,వేగుళ్ళ జోగేశ్వరరావుల సహకారం అభినందనీయం.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మెచ్చిన నేతగా ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులను, బీజేపీ ఎమ్మెల్యే గా అటు కేంద్ర ప్రభుత్వ నిధులను ఒడిసిపట్టుకుంటున్న ఎమ్మెల్యే నల్లమిల్లి సమయస్ఫూర్తిని ప్రజలంతా వేనోళ్ళ పొగుడుతున్నారు.
నాడు కోట్ల రూపాయిల సొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ నల్లమిల్లిని బీజేపీ లోకి వెళ్ళేలా చేసిన అనపర్తి వైయస్సార్ సిపి నాయకులు జరుగుతున్న పరిణామాలు చూసి చింతించని రోజు లేదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
