
త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు. పరిస్థితి తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.
పూర్తి స్ధాయి నివేదికలు వచ్చే వరకు అధికారులు నిర్ణయానికి రావద్దు – ఎమ్మెల్యే, నల్లమిల్లి, బలభద్రపురంలో క్యాన్సర్ నిర్దారణ కోసం సర్వే జరుపుతున్న వైద్య అధికారులను కలసిన ఎమ్మెల్యే, నల్లమిల్లి. సర్వే జరుగుతున్న తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, నల్లమిల్లి,సరైన విధానంలో నిర్ధారణ జరపకుండా నివేదికలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని తప్పు దారి పట్టించడం పట్ల నల్లమిల్లి ఆగ్రహం,
ఈ సందర్బంగా ఎమ్మెల్యే, నల్లమిల్లి మాట్లాడుతూ… బలభద్రపురంలో క్యాన్సర్ ప్రమాదం గురించి నేను అసెంబ్లీలో లేవనెత్తడం తదనుగుణంగా ముఖ్యమంత్రి, కార్యాలయం, ఆరోగ్య శాఖా మంత్రి, స్పందించడం జరిగింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మెడికల్ టీమ్ లు ఇక్కడకు వచ్చి ఇంటింటి సర్వే చేస్తున్నారు. జిల్లా హెల్త్ అధికారులు ఇక్కడ 6 కేసులు మాత్రమే ఉన్నాయని కమీషనర్ హెల్త్ కి సమాచారం ఇవ్వడం, వారు నాకు కాల్ చేసినపుడు అధికారులు పీహెచ్ సి ల సమాచారం మాత్రమే చెపుతున్నారు నేనే పదిహేను కుటుంబాలను పరామర్శించాను అని నేను చెప్పడంతో కమీషనర్ తక్షణం హెల్త్ బృందాలను పంపడం జరిగింది.
కాకపోతే నిన్న సర్వే జరిగిన తీరు లోపభూయిష్టంగా ఉంది. సామాన్యులకు అర్ధం కాని ప్రశ్నలు అడగటం వలన ఏం ఉపయోగం లేదు. నిన్న వైద్యాధికారులు పూర్తిగా గ్రామంలోకి వెళ్ళలేదు. ఆంకాలజిస్టుల సపోర్టు లేకుండా మెడికల్ స్టాప్ ఎంతమందికి వ్యాధి ఉందో నిర్దారించగలరు?
నిన్న రాత్రి ప్రభుత్వం ఉన్నత స్ధాయి సమావేశం నిర్వహించింది. ఇక్కడ నుండి 23 కేసులే నమోదు అయ్యాయి 50% సర్వే పూర్తయిందని సమాచారమ ఇవ్వడంతో వారు ఇక్కడ సీరియెస్ నెస్ లేదనే అభిప్రాయానికి వచ్చారు.
ఈరోజు నేను ఇక్కడకు వచ్చి అధికారులను అడిగితే ఆరోగ్యశ్రీ డేటా మాత్రమే తీసుకున్నాం అని చెపుతున్నారు. ఎంతమంది ఆరోగ్యశ్రీ వాడుతున్నారు. ఎంతమంది నగరాలకు వెళ్ళి ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం లేదా?
ఇక్కడ నాయకులే 60 మంది భాధితుల లిస్టు చెపుతా ఉంటే అవేం పరిశీలించకుండా అధికారులు 23 కేసులే అని ఎలా చెపుతున్నారు?
వైద్య అధికారులు ప్రతీ ఇంటికి వెళ్ళినపుడు మాత్రమే సమగ్రమైన నివేదిక వస్తుంది. స్క్రీనింగ్ టెస్టులు జరుగకుండా రోగ నిర్దారణ ఎలా జరుగుతుంది?
ప్రాధమిక స్ధాయి నివేదికలను బట్టి అంచనాకు రావద్దని అధికారులను కోరుతున్నాను. పూర్తి స్దాయి నివేదికలు రావడానికి ఐదారు రోజులు పడుతుంది. ఈలోగా అంచనా వేసి విషయాన్ని ప్రక్కదారి పట్టకుండా చూడమని కోరుతున్నాను,డెత్ సర్టిపికెట్ లో నమోదైన కారణాలు, ఆరోగ్యశ్రీలో చికిత్సలు, ప్రభుత్వాసుపత్రిలో వైద్యం మాత్రమే పరిగణలోకి తీసుకుంటే సరికాదని చెపుతున్నాను, సమగ్రమైన సర్వే పూర్తయ్యే వరకూ నేను వ్యక్తిగతంగానే పర్యవేక్షిస్తాను.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
