గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని బస్టాండ్ కాలనీకి చెందిన చిట్యాల రంజిత్ అనే సింగరేణి కార్మికుడు తన పర్స్ ను బస్టాండు సమీపంలో పొగొట్టుకున్నాడు. వరంగల్ కు చెందిన ఎర్రం అనిల్ కు ఈ పర్సు దొరికింది. అయితే వెంటనే అనిల్ సమీపంలో ఉన్న రామగుండం ట్రాఫిక్ పోలీసులకు నిజాయితీతో అందించాడు. రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వర్ రావు ఆదేశాల మేరకు పర్సులో ఉన్న నెంబర్ ప్రకారం చిట్యాల రంజిత్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు.
అనంతరం పర్సు దొరికిన అనిల్ చేతుల మీదుగా రంజిత్ కు పర్సును అప్పగించారు. అ పర్సులో ఐదు వందల నగదు తో పాటు ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఐడెంటి కార్డులు ఉన్నాయి. ఈ సందర్భంగా అనిల్ ను ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు తోపాటు ఎస్సై హరి శేఖర్ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు, వెంకటేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App