WhatsApp Image 2023 12 20 at 3.50.33 PM
11ఏళ్ల చిన్నారికి 50ఏళ్ల గుండె
తిరుపతి
11ఏళ్ల చిన్నారికి 50ఏళ్ల వ్యక్తి గుండెను అమర్చిన అరుదైన ఘటన తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో జరిగింది. వనస్థలిపురానికి (TS) చెందిన చిన్నారికి గుండెమార్పిడి అవసరం కాగా.. అప్పటికే బ్రెయిన్ డెత్ అయిన 50ఏళ్ల వ్యక్తి(శ్రీకాకుళం) కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. శ్రీకాకుళం నుంచి హెలికాప్టర్లో వైజాగ్, ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్లో తిరుపతికి తీసుకొచ్చి గుండెమార్పిడి చేశారు.
