TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం 1 జిఎం ఆఫీస్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గురువారం సింగరేణి చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630 /1982 అధ్యక్షులు యాట ఓదెలు, ఏరియా ఉపాధ్యక్షులు జనగామ నర్సయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సి అండ్ ఎం డి బలారం నాయక్ హాజరై మాట్లాడుతూ, సింగరేణిలో ఎక్కడ లేని విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల స్థానిక అధికారులను, అసోసియేషన్ నాయకులు అభినందించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ ఆపరేషన్ కె వెంకటేశ్వర్లు డైరెక్టర్ పి అండ్ పి ఎల్ సూర్యనారాయణ బాబా సాహెబ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్ జీవన్ జిఎం డి లలిత్ కుమార్ తో పాటు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగారపు లింగమూర్తి ఆరేపల్లి రామచందర్, బడికెల కృష్ణ, పులిమోహన్, ఆకునూరి రాజశేఖర్, ఉమేందర్, సురేష్ బాబు, అంకుల్, పసుల రాయలింగు, జనగామ శంకర్, చేరాలు, రాజేష్, గడ్డం స్వప్న, జనగామ స్వప్న తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ambedkar's statue
Ambedkar’s statue