
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా కలెక్టర్ ఎస్.దినేష్ కుమార్ ఆధ్వర్యంలో, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా పాడేరు ఓల్డ్ బస్ స్టాండ్ ఆవరణలో కూటమి నాయకులందరూ ఐకమత్యం అయ్యి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఆసమానతలు తొలగించేందుకు భారత రాజ్యంగ రూపశిల్పి, డా. బీఆర్ అంబేద్కర్ జీవితకాల కృషి చేశారని, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కొనియాడారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య 134వ జయంతి సందర్భంగా, డా. బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలనీ పిలుపునిచ్చారు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు ఆయన జీవితకాల పోరాటం చేశారని తెలిపారు.ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని మన జీవితంలో మార్పులకు సంకల్పించాలని వివరణ ఇచ్చారు. అలాగునే టీడీపీ పాడేరు ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘన నివాళి అర్పించారు. అనంతరం గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి తరానికి ఉదాహరణగా నిలుస్తుందని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, అధికార ప్రతినిధిలు, కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
