
కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ గా నీలకంఠం
అల్లూరి సీతారామరాజు జిల్లా,త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 15: వెంగడ నిలా కంఠం మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా, ముంచింగిపుట్ మండల అధ్యక్షులుగా నేను చేసిన సేవలను గుర్తించి నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసి కమిటీ వైస్ చైర్మన్ గా నియమించినందుకు పిసిసి చీప్ షర్మిల రెడ్డి , ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ కమిటీ చైర్మన్ డాక్టర్ విక్రాత్ బూరియ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసి చైర్మన్ రీమల నవభారత్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ అబ్జర్వర్ పాచిపెంట శాంత కుమారి , అల్లూరి సీతారామరాజు డిసిసి అధ్యక్షులు శతక బుల్లి బాబు కూ, అరకు నియోజకవర్గ కోఆర్డినేటర్ శెట్టి గంగాధర స్వామి కూ ముకుళిత హస్తాలతో అభివాదములు.
మీరు అత్యంత అభిమానంతో నాయందు నమ్మకముంచి కాంగ్రెస్ కమిటీ వైస్ చైర్మన్ గా నన్ను నియమించి నందులకు మీకు కృజ్ఞతాభి వందనములు తెలియ జేస్తున్నాను. మీరిచ్చిన వైస్ చైర్మన్ బాధ్యతను ఒక సవాలుగా తీసుకొని రాష్ట్ర గిరిజనుల అభివృద్ధి పట్ల, శ్రద్ధ వహించి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తేవడానికి అహర్నిశలు శ్రమించి సక్రమంగా నాభాద్యతలు నిర్వ ర్తిస్తానని తెలియజేసుకుంటున్నాను.
రాష్ట్ర వైస్ చైర్మన్ గా నేను స్వీకరించ బోయే కర్తవ్యాలను నాకు అప్పగించిన బాధ్యతను శ్రద్ధ శక్తులతో అంతఃకరణ శుద్ధితో నిర్వ ర్తిస్తాను. రాష్ట్ర గిరిజనులతో మమేకమై వారి సాదక బాధలను ఎప్పటికప్పుడు తెలిసుకొని వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మన పార్టీని నమ్మి, మన వెంట ఉన్న ఆదివాసీల రుణం తీర్చు కుంటానని, మీ సలహాలు సూచనలు మేరకు నా భాద్యతలు మనసా, వాచా, కర్మణా నిర్వర్తిస్తానని హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసు కుంటున్నాను. ఆని తెలిపరు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
