
ఒట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82వేల 320 ఓట్ల మెజార్టీ
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. ఒట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82 వేల 320 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తం 9 రౌండ్లలో లక్షా 45 వేల 57 ఓట్లు ఆలపాటి రాజా సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు 62 వేల 737 ఓట్లు సాధించారు. మొత్తం 2 లక్షల 41 వేల 491 ఓట్లు పోలయ్యాయి. అందులో 26 వేల 679 ఓట్లు చెల్లనివే ఉన్నాయి. చెల్లుబాటు అయిన ఓట్లలో 60 శాతం పైగా ఓట్లు ఆలపాటి రాజా సాధించారు.
తొలి రౌండ్ నుంచి భారీ ఆధిక్యంతో: గుంటూరులోని ఏసీ కాలేజీలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బ్యాలెట్ పద్ధతి కావడంతో పాటు బరిలో 25 మంది ఉండడంతో లెక్కింపునకు ఎక్కువ టైమ్ పట్టింది. ఆలపాటి రాజేంద్రప్రసాద్ తొలి రౌండ్ నుంచి భారీ ఆధిక్యంతో కొనసాగారు. ప్రత్యర్థుల్లో సిటింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లను సాధించారు. మిగిలినవారు నామమాత్రంగానే ఓట్లు సాధించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
