TRINETHRAM NEWS

Trinethram News : ఉండవల్లి: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఆలపాటి రాజా ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు..

ఈ నేపథ్యంలో తెనాలి తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజాను తన నివాసానికి పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడారు. ఈ భేటీలో ఆయన రాజకీయ భవిష్యత్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది..