
రాష్ట్ర అధ్యక్షులు బుర్ర తిరుపతి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం రీజియన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ లలో ఉన్న ఓ.బి కాంట్రాక్టు కంపెనీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు గత మూడు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ ల సాధన కోసం సమ్మె చేస్తున్నారని వారి సమ్మెకు సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి మద్దతు తెలుపుతుందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బుర్ర తిరుపతి ఒక ప్రకటన లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు గాని, 22 జీవో ప్రకారం వేతనాల హామీని నెరవేర్చాలని కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను స్థానిక రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ చొరవ తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని ఏఐటియుసి పక్షాన కోరుతున్నామని లేనిచో సింగరేణి యాజమాన్యంపై ప్రత్యక్ష పోరాటాలకు ఏఐటియుసి యూనియన్ సిద్ధమవుతుందని ఆయన పేర్కొన్నారు.
వారి సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం మరియు ఓ.బి కాంట్రాక్టు కంపేనీలు చొరవ తీసుకుని సమ్మెకు ముగింపు పలకాలని ఆయన కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
