సింగరేణి నూతన డైరెక్టర్లను సన్మానించిన గుర్తింపు సంఘం ఏఐటియుసి నాయకులు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి సంస్థలో నూతనంగా ఎన్నికైన ఇద్దరు డైరెక్టర్లను సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు మంగళవారం రోజున హైదరాబాదులో డైరెక్టర్ ఆపరేషన్ ఎల్.వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ కొప్పుల వెంకటేశ్వర్ల లను కలిసి వారికి శాలువా కప్పి సన్మానించి, పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ మనుగడకు, కార్మికుల సంక్షేమం కొరకు, కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని వారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డైరెక్టర్ లను కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App