సి అండ్ ఎండి కి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపిన ఏఐటియుసి నాయకులు.
సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపండి.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి సి అండ్ ఎండి ఎన్ బలరాం నాయక్ కు సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి నాయకులు పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సి అండ్ ఎండి బలరాం నాయక్ కు మరో సంవత్సరం పదవి లో కొనసాగేందుకు ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో సింగరేణి భవన్ లో మర్యాద పూర్వకంగా బలరాం నాయక్ కలిసి అభినందనలు తెలపడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు పేర్కొన్నారు.
అదేవిధంగా సింగరేణి లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు కాలానుగుణంగా జరిగే స్ట్రక్చర్ సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించాలని వారు సి అండ్ ఎండి ని కోరారు. దీని పై యాజమాన్యం కు గుర్తింపు సంఘం గా లేఖ రాయడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి కే.సారయ్య, కందికట్ల వీరభద్రం, వై.వి.రావు, ముస్కె సమ్మయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App