Adjustment is not correct without solving problems: APTF
Trinethram News : అమరావతి :
గత ప్రభుత్వ విధానాలతో అస్తవ్యస్తంగా మారిన విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా ఉపాధ్యాయుల పని సర్దుబాటు చేయడం సరికాదని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి అన్నారు.
మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పార్వతిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
జీవో-117ను రద్దు చేయకుండా ఉపాధ్యాయుల సర్దుబాటు తగదు.
గత ప్రభుత్వంలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేశారు.
తరగతుల విలీనం చేశారు. ఉపాధ్యాయులకు అధిక పీరియడ్లు కేటాయించారు. అనవసర యాప్ల భారం మోపారు’’ అని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App