TRINETHRAM NEWS

ముఖ్యమంత్రి ప్రకటనతో ఆదివాసి అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాలు 48 గంటలు బంద్ విరమణ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : *ఆదివాసీ అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల వేదిక. ముఖ్యమంత్రి ప్రకటనతో 48 గంటల బంద్ విరమణ. 24 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో 1/70 చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి. 1/70 చట్టం జోలికిస్తే తీవ్ర పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కుటుంది. అయ్యన్న పాత్రుడు ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి

1/70 చట్టాన్ని సవరించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ స్పష్టమైన ప్రకటన చేయడంతో 48 గంటల రాష్ట్ర మన్యం బంద్ విరమిస్తున్నట్లు ఆదివాసీ అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల వేదిక ప్రకటించింది.

1/70 చట్టం సవరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి X లో పోస్ట్ చేసారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి కూడా మీడియా సమక్షంలో 1/70 చట్టం సవరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ప్రకటించారు . ప్రభుత్వ ప్రకటనను జిల్లా కలెక్టర్ ఆదివాసీ అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల వేదిక నాయకులను చర్చలకు ఆహ్వానించి ప్రభుత్వ వైఖరిని తెలియపరిచి మీడియా సమక్షంలో ప్రకటించారు . ఆదివాసీ అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల వేదిక నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రకటన ను స్వీకరిస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన విధాన నిర్ణయాన్ని 24 నుండి ప్రభుత్వం నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో 1/70 చట్టం అమలుపై చర్చించాలని, ప్రభుత్వం 1/70 చట్టం సవరణ చేయాలన్న అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇవ్వాలని, డిమాండ్ చేసారు . ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి ప్రకటనను స్వీకరిస్తున్నాము. కానీ మరోపక్క 1/70 చట్టాన్ని ఉల్లంగిస్తూ హైడ్రో పవర్ ప్రోజెక్ట్ ను నవయుగ కంపెనీ కేటాయించడాన్ని తీవ్రంగా ఖండించారు .

ముఖ్యమంత్రి జి.ఓ నెంబర్ 3 పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించింది. 24 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఆదివాసీలకు 100 శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ చట్టం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. బంద్ సందర్బంగా పోలీసులు గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని నాయకులు కోరారు. నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్పించడానికి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని, భవిష్యత్ లో 1/70 చట్టం జోలికొస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవలసి వస్తుందని, ప్రభుత్వానికి నాయకులు హెచ్చరిక జారీ చేశారు .

జిల్లా కెలెక్టర్ సమక్షంలో 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని ఆదివాసీ సంఘాలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని కెలెక్టర్ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే ఎం. విశ్వేశ్వరరాజు, గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనరస, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, దండకారణ్య ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ కేంద్ర కమిటీ సభ్యులు సమరెడ్డి మాణిక్యం, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ , ఆదివాసీ కాఫీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.లక్కు,ఆదివాసీ సేన కన్వీనర్ చుంచు రాజుబాబు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు వంతల నాగేశ్వరావు, పెద్దబయలు ZPTC కూడ బొంజుబాబు, మాజీ ఎంపిపి సళ్లంగి మహేష్ ,మహిళ సంఘం నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Adivasi all-party politica