ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి అదనపు
కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ
పెద్దపల్లి, జనవరి 20 : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ప్రయత్నం చేయాలని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. సోమవారం స్వశక్తి మహిళలు ఏర్పాటు చేసుకున్న మొబైల్ ఫుడ్ కోర్ట్ ను పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ తో కలిసి సోమవారం సాయంత్రం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలుగా మహిళలు ఎదగడానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తుందని అన్నారు. రామగుండం శాసన సభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ , జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు , రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సహకారంతో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని రామగుండం స్వశక్తి మహిళలు క్యాంటీన్లు , ఇతరత్రా స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకోవాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె.
అరుణ శ్రీ మాట్లాడుతూ మెప్మా సహకారంతో రుణాలు పొంది స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకొని స్వశక్తి మహిళలు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. మొబైల్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన 22 వ డివిజన్ క్రషర్ నగర్ కు చెందిన సిరి చందన మహిళా పొదుపు సంఘం ( కల్ప వృక్షం మహిళా సమాఖ్య ) సభ్యురాళ్లను అభినoదించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాల రాజ్ కుమార్ , శంకర్ నాయక్ , నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, నగర పాలక సంస్థ ఇ ఇ రామన్ , మెప్మా టి ఎం సి మౌనిక , సి ఓ లు , ఆర్ పిలు , సిరి చందన మహిళా పొదుపు సంఘం సభ్యురాళ్ళు లావణ్య , సంధ్యా రాణి , పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నూనె లతా మోహన్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App