Additional Collector inspected the arrangements at Vinayaka immersion point in Ellamma pond
వైభవోపేతంగా గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
పెద్దపల్లి సెప్టెంబర్ 13: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలో వైభవోపేతంగా గణేష్ నిమజ్జనం జరిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్లు అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు.
శుక్రవారం పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ పరిశీలించారు.
అనంతరం అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ, వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు పోలీసులు అందించేలా చర్యలు తీసుకున్నామని అదనపు కలెక్టర్ తెలిపారు.
గణేష్ నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన మేరకు భారీ క్రేన్లు, లైటింగ్ ఏర్పాట్లు, సీసీటీవీ ఏర్పాట్లు చేశామని , గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గజ ఈతగాళ్లు, మెడికల్ క్యాంపులు, ఫైర్ సర్వీస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
అంతకుముందు అదనపు కలెక్టర్ మంథనిలోని నిమజ్జనం పాయింట్లను సందర్శించి వినాయక నిమజ్జనానికి చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App