TRINETHRAM NEWS

పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేపట్టాలి అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్

*సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

*ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

సుల్తానాబాద్, అక్టోబర్ -19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ధాన్యం కొనుగోలు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు.

శనివారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సుల్తానాబాద్ సర్కిల్ లో ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ, సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో గల 8 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో మొత్తం 57 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సుల్తానాబాద్ ప్రాంతంలో వరి కోతలు ముందుగా జరిగే నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గన్ని బ్యాగులు ,ప్యాడ్ క్లీనర్లు, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాలని , ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర పరిసరాలను శుభ్రం చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్, త్రాగు నీరు, కుర్చీలు మొదలగు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. వర్షాల దృష్ట్యా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలని అన్నారు. సన్న రకాల ధాన్యం కొనుగోలు వివరాలను టామ్ టామ్ చేయాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలు, మద్దతు ధర , రైతులు తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు వివరాలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. సన్న రకం దాన్యం నాణ్యత వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ధ్రువీకరిస్తారని అన్నారు. ఏ.ఈ.ఓ టోకెన్ నెంబర్, ధాన్యం రకం వివరాలు, ధాన్యం పరిమాణం, నాణ్యత మొదలగు అంశాల సర్టిఫికెట్ పరిశీలించి కాంటా పెట్టాలని అన్నారు.

కోనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన హామాలీలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వివరాలను ఆన్ లైన్ లో ఎంటర్ చేసి ట్రాక్ షీట్ జనరేట్ చేయాలని, రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కోనుగోలు కేంద్రాలలో గన్ని సంచులు అవసరం మేర పెట్టుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీ మాల, సుల్తానాబాద్ తహసిల్దార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App