చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖనిలోని హనుమాన్ నగర్ వీధిలో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి అకారణంగా సీసీ కెమెరను, ఆటోను ధ్వంసం చేసినట్టుగా దరఖాస్తు రావడంతో దానిపైన కేసు నమోదు చేసిన పోలీస్లు గోదావరిఖని వన్ టౌన్ పోలీసు ఆధ్వర్యంలో విచారణ చేపట్టడం జరిగింది. సీసీ కెమెరా ఆధారంగా ఆటోను, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించడం జరిగింది. 1) తాండ్ర విశ్వతేజ 2)గడ్డం అరుణ్ కుమార్ 3)పట్ల సాయి తేజలు ధ్వంసం చేసినట్టుగా గుర్తించి వారిని అరెస్టు చేయడం జరిగింది.
ఇందులో తాండ్ర విశ్వతేజ యొక్క బర్త్డే శనివారం రోజు అయినందున బర్త్డే ని పురస్కరించుకొని నిన్న ఆదివారం సాయంత్రం తన స్నేహితులైన అరుణ్ కుమార్, సాయి తేజ లకు పార్టీ ఇచ్చి ముగ్గురు కలిసి మద్యం మత్తులో హనుమాన్ నగర్ వీధిలోని సీసీ కెమెరాలు, ఆటోను ధ్వంసం చేయడం జరిగింది
ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా యువతకు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరక. తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని అర్ధరాత్రి బయట తిరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App