TRINETHRAM NEWS

ఎర్ర యాకన్న, అధ్యక్షులు, కూకట్ పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 31 : తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన జర్నలిస్టుల ఆత్మీయుల సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బైరాగి, ఓయూ జేఏసీ నాయకులు దరువు అంజన్న, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్నలు తెలిపారు.గత ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బైరాగి ఆరోపించారు.

సోమవారం కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వాల్పోస్టర్ ను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు దరువు అంజన్న చేతులమీదుగా గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అక్రిడేషన్ కార్స్, హెల్త్ కార్డ్స్, ఇంటి స్థలాలు, జర్నలిస్టుల టవర్స్ వంటి హామీలు తుంగలో తొక్కారని, పస్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిన ఇప్పటివరకు జర్నలిస్టులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

అనంతరం కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న మాట్లాడుతూ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో విలేకరుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కొందరు బ్రోకర్లు హౌసింగ్ సొసైటీల పేరు చెప్పి విలేకరుల మంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ పేరుతో ఎవరు వసూలు చేసిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కో కన్వీనర్ డప్పు రామస్వామి, తెలంగాణ కేబుల్ చానల్స్ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనందరావు, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ సలహాదారులు కిషోర్ చారి, కోశాధికారి నగేష్, జాయింట్ సెక్రెటరీ సుజాత, సభ్యులు మహేష్ చారి, కరుణ కుమార్, హేమంత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Action will be taken