![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-15.56.12.jpeg)
1/70 చట్టం అసెంబ్లీ పరిధిలోది కాదు, అయ్యన్న అవగాహన రాహిత్యానికి నిదర్శనం: ఆదివాసి జెఏసి
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్ : 1/70 భూబదాలయింపు నిషేధ చట్టం అసెంబ్లీ పరిధిలోది కాదని,అయ్యన్న అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి సలహాదార్లు కొండగొర్రి ధర్మరావు, అరిక నీలకంఠం,రాష్ట్ర వైస్ చైర్మన్లు మొట్టడం రాజబాబు,మొడియం శ్రీనివాస్ రావు,తెల్లం శేఖర్,బంగారు వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖి శేషాద్రి,ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ రామరావుదొర,రంపచోడవరం డివిజన్ కన్వీనర్ పి. కామరాజు, జెఏసి కేంద్ర కమిటీ సభ్యుడు మడావి నెహ్రూ,రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు కంగాలి శ్రీనివాస్. 1/70 చట్టంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు.
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అవగాహన రాహిత్య వ్యాఖ్యలకు నిరసనగా ఫిబ్రవరి 12న రాష్ట్రవ్యాప్త మన్యం బందుకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి పిలుపునిచ్చిన విషయం విదితమే, టూరిజం పారిశ్రామికవేత్తల సమావేశంలో షెడ్యూల్ ప్రాంతంలో ఎస్టీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టలేరని,ఎస్టీలను కించపరుస్తూ, 1/70 భూ బాదాలయింపు నిషేధ చట్టాన్ని సవరణ చేయడానికి ఉన్నా అవకాశాలను, అధ్యయనం చేయాలని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కలెక్టర్లకు సూచించడం దారుణమని,
1/70 చట్టం అసెంబ్లీ పరిధిలోది కాదని, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు పేరా 5 (2) ప్రకారం గిరిజన సలహా మండలితో కూడిన గవర్నర్ ద్వారా చట్టం చేయబడింది.అసెంబ్లీ ఏర్పడి సుమారు 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్)ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగాన్ని అవమానపరచుటమేనని,
ఎంతో బాధ్యతయుతమైన స్పీకర్ పదవిలో ఉండి ఆదివాసి చట్టాలపై తనకు అవగాహన లేదని చెప్పడం సిగ్గుచేటని, ఆదివాసి చట్టాలపై గౌరవం లేని వ్యక్తి స్పీకర్ గా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమన్నారు.వేలకోట్లు గిరిజన ఉప ప్రణాళిక(టిఎస్పి) నిధులు దారి మళ్ళించి ఎస్టీలను పేదలను చేసింది వీరు కాదా అని ప్రశ్నించారు. ఆదివాసీలు కోట్లలో పెట్టుబడులు పెట్టలేరని హేళనగా మాట్లాడటం ఆయన యొక్క సూక్ష్మ బుద్ధికి నిదర్శనమని,
ఆదివాసుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలోకి మళ్లించిన విషయాన్ని దాచిపెట్టి ఏజెన్సీ ప్రాంతల అభివృద్ధికి 1/70 చట్టం అడ్డుపడుతుందని అనడం హశ్యస్పదంగా ఉందని, స్పీకర్ తన పరిధిలో లేని అంశాన్ని అవహేళన చేసి మాట్లాడినందుకు ఆదివాసీలకు క్షమాపణలు చెప్పాలని,నిజంగానే ప్రభుత్వానికి ఆదివాసుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఒక్కొక్క ఐటీడీఏకు 500 కోట్లు నిధులు కేటాయించి ఆదివాసులను, పారిశ్రామికవేత్తలుగా తీర్చేదిద్దాలని,ఏజెన్సీ ప్రాంతం నుంచి లేటర్ రైట్, గ్రానైట్,బ్లాక్ మెటల్ వంటి ఖనిజ సంపద అక్రమంగా తరలించుకు పోతూ కనీసం డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఏజెన్సీకి ఇవ్వడం లేదని,షెడ్యూల్ ప్రాంత భూ బదులాయింపు నిషేధ చట్టం గురించి అవగాహన లేదని అయ్యన్న చెప్పటం ఆయన తెలియని తనానికి నిదర్శనంమని, ఆయ్యన్న స్పీకర్ మరియు ఎమ్మెల్యే పదవికి అనర్హుడని,
జిఓ నెం 3 రాజ్యాంగ బద్ధమే అయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల తరుపున కోర్టులో బలమైన వాదనలు వినిపించకపోవడం వలన జిఓ నెం 3 ని సుప్రీంకోర్టు కొట్టి వేసిందని, రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజ్యాంగం గురించి, ఐదవ షెడ్యూల్ గురించి తెలియని వ్యక్తులకు శిక్షణ అవసరం ఎంతైనా ఉందన్నారు.షెడ్యూల్ ప్రాంత చట్టాలపై అవగాహన లేని స్పీకర్ అయ్యన్న ఆదివాసీలను, కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని,1/70 భూబదాలాయింపు నిషేధ చట్టం పటిష్టంగా అమలు చేస్తూ, ఏజెన్సీ ప్రాంతం ముఖ ద్వారాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏజెన్సీకి వచ్చే వారి వివరాలను నమోదు చేయాలని, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (టిఏసి)ను వెంటనే ఏర్పాటు చేయాలని,అసెంబ్లీ భవనం పక్కనే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ భవనం ఏర్పాటు చేయాలని,ప్రభుత్వం స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు రాజ్యాంగంపై ముఖ్యంగా ఐదో షెడ్యూల్ పై శిక్షణ ఇప్పించాలని,రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ నియమాలను అనుసరించి, షెడ్యూల్ ప్రాంతాల ఉద్యోగ నియామకల చట్టం చేయాలని,ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి అన్ని శాఖలకు, ఐటీడీఏల ద్వారా నోటిఫికేషన్లు జారీ చెయ్యాలని, నాన్ షెడ్యూల్ గ్రామాలుగా ఉన్న 792 గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించాలని,
రాజ్యాంగ ఉత్తర్వులు ద్వారా ప్రకటించిన మొత్తం షెడ్యుల్ ప్రాంతాన్ని రెండు లేదా మూడు ప్రత్యేక ఆదివాసి జిల్లాలుగా ప్రకటించాలని,కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీలకు కేటాయించిన నిధులను దారి మల్లించకుండా ఎస్టీ లకే ఖర్చు చేయాలని,ఆదివాసి జేఏసీ మీడియా ముందు డిమాండ్ చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Adivasi JAC](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-15.56.12.jpeg)