TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా, ఫ్యామిలీ బ్లూమ్స్ అనే అంశంపై అంగరంగ వైభవంగా పాఠశాల విద్యార్థులతో వారి తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమాన్ని జరిపి, తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏసిపి చల్లా ప్రతాప్, చల్లా ప్రవీణ్, కొండపర్తి సంజీవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫ్యామిలీ బ్లూమ్ అనే కార్యక్రమం భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మరియు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా శ్రీ చైతన్య యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, తద్వారా కుటుంబంలోని నైతిక విలువలు మరియు అనుబంధాలను ధృడపరచడానికి అవకాశం ఉంటుందన్నారు.

ఈ విధంగా విద్యార్థులకు చిన్నతనం నుండి నైతిక విలువలను నేర్పడం ద్వారా, మంచి సామాజిక పరిణితి కలిగి ఉండి, చక్కటి భవిష్యత్తు ఏర్పాటు అవుతుందని కొనియాడారు. అంతే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో అటు విద్యను అందించడంతోపాటుగా, ఇటు నైతిక మరియు మానవ విలువలను విద్యార్థులలో అలవరచడం శ్రీ చైతన్య పాఠశాలల ప్రధాన ఉద్దేశం అని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులు తల్లిదండ్రులకి మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు చోటునిస్తాయని, మరియు వారిలో నైతిక విలువలు పెంపొందడానికి దోహదపడతాయన్నారు.

తదనంతరం విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులకు పాద పూజ చేసి, వారి ఆశీర్వాదము తీసుకొని, వారికి బహుమతులు ప్రదానం చేసి,తల్లిదండ్రుల ప్రాధాన్యతని ఉపన్యాసాలు, పాటల రూపంలో తమ ప్రేమని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవింద్ రెడ్డి కోఆర్డినేటర్ నాగరాజు మరియు పాఠశాల డీన్ శ్యాంసుందర్, సి బ్యాచ్ ఇంచార్జ్ కిరణ్ మరియు ఇన్చార్జులు స్రవంతి, తస్లీమ్, వీరితోపాటు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App