
ఆడబిడ్డ పెళ్ళికి 11000/- వేల రూపాయల నిత్యావసర సరుకులు అందించిన అభ్యుదయ ఫౌండేషన్ సామాజిక సేవకులు
Trinethram News : లింగాపూర్ : పేదింటి ఆడబిడ్డలకు అభ్యుదయ ఫౌండేషన్ సభ్యులు పెద్దన్నగా వ్యవహారిస్తున్నారని అభ్యుదయ ఫౌండేషన్ లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ అన్నారు. కొమురం భీం జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద రైతు జాధవ్ సురేఖా కైలాష్ దంపతుల కుటుంబ ఆర్థిక పరిస్థితిని అభ్యుదయ ఫౌండేషన్ ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ అభ్యుదయ ఫౌండేషన్ గౌరవ సభ్యులైన జాధవ్ సుశీల్, జాధవ్ మారుతీ కీ వివరించి, కూతురు జాధవ్ జయశ్రీ వివాహానికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు.
నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతో అభ్యుదయ ఫౌండేషన్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు జాధవ్ కైలాష్, చవాన్ శివా, జాధవ్ జైల్సింగ్, వెలువాక శ్రీకాంత్, పార్డే ధమ్మా, టిగోటే అరుణ్, మగ్రే సుమిత్ (NRI), జాధవ్ గణేష్, జాధవ్ ధరం, ఆడే రాహుల్, పవార్ ధనరాజ్, రాథోడ్ మహేష్, ఆడే ప్రవీణ్ (NRI) ద్వారా తమవంతుగా రూ.11000/- వేల రూపాయలు విలువైన నిత్యావసర సరుకులను అమ్మాయి తల్లిదండ్రులు జాధవ్ సురేఖా కైలాష్, నానమ్మ జాధవ్ ఝాలిబాయి కీ గురువారం అందజేశారు. పేద కుటుంబానికి అండగా నిలిచిన అభ్యుదయ ఫౌండేషన్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులకు ఆడబిడ్డ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా లింగాపూర్ మండల ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ మాట్లాడుతూ … పేదింటి ఆడబిడ్డలకు లింగాపూర్ అభ్యుదయ ఫౌండేషన్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు పెద్దన్నగా వ్యవహరిస్తూ, తనవంతుగా ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. సామాజిక సేవలో భాగంగా అభ్యుదయ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాధవ్ సుశీల్, జాధవ్ శ్రీనివాస్, జాధవ్ మారుతీ, జాధవ్ అజేశ్, రాథోడ్ మోహన్, రాథోడ్ భారత్, చవాన్ కృష్ణ తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
