TRINETHRAM NEWS

నగరి మున్సిపాలిటీ పరిధిలో వర్కర్స్ కాలనీ ఏర్పాటుచేయాలి..

నగరి త్రినేత్రం న్యూస్

నగరి మున్సిపాలిటీలో పని చేయు శానిటేషన్,మరియు ఇంజనీరింగ్ కార్మికులకు నగరి మున్సిపాలిటీ పరిధిలో వర్కర్స్ కాలనీ ఏర్పాటు చేయాలి.. నియోజవర్గంలో ఉన్న ఆశ అంగన్వాడి ఆటో అర్హులైన కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించాలి. నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే కి ఈరోజు వినతి పత్రం ఇవ్వడంజరిగింది.
ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య

నగరి మున్సిపాలిటీ లో పనిచేయు మున్సిపల్ కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించి పక్కా గృహ నిర్మాణాన్ని నిర్మించి ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మురళి అధ్యక్షతన తిరుపతిలోని ఎమ్మెల్యే నివాసం నందు నగరి నియోజకవర్గ టిడిపి పార్టీబాధ్యులు చినబాబు కి ఏఐటియుసి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో పనిచేసేటువంటి కార్మికులకు కాలనీ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది మన నగిరి మున్సిపాలిటీ పరిధిలో అనేక సందర్భాల్లో అధికారులకు దృష్టికి గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వారికి న్యాయం జరగలేదు. కావున కొత్తగా నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు భూమి ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సందర్భంగా ఆయన అక్కడ వెళ్లినందున నగరి నియోజకవర్గ టిడిపి పార్టీ చిన్నబాబు కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కుప్పం పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఎమ్మెల్యే దృష్టికి మీ సమస్యలను తీసుకొని మీకు అర్హులైన వారికి ఇంటి స్థలాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.

గతంలో జగనన్న కాలనీలో కూడా కార్మికులకు న్యాయం జరగా లేదు. ఇప్పటికైనా కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించాలని వర్కర్స్ కాలనీ ఏర్పాటు చేస్తే అత్యవసర పరిస్థితుల్లో పనులు చేసే దానికి కూడా రావడానికి ఇబ్బంది లేక ఉంటుంది కావున మీ ద్వారా అధికార యంత్రాంగం ఆ విధంగా వర్కర్స్ కాలనీ ఏర్పాటు చేయాలని కోరారు నగరి నియోజకవర్గంలో ఉన్న ఆశ అంగన్వాడి మధ్యాహ్నం భోజనం ఆటో హమలి కార్మికులకు కొన్ని వార్డులు కాలనీలో ఉన్న నిరుపేదలకు అర్హులైన వారి అందరికీ ఇంటి స్థలాల కేటాయించాలని కోరాము. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ కచ్చితంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్ళి అర్హులైన ప్రతి కార్మికులకు స్థలాలు ఇచ్చే విదంగా చర్యలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ ఏఐటీయూసీ నాయకులు , మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మురళి నాగరాజు దీప సతీష్ చినరాజ్ విమల రమేష్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App