
తేదీ : 18/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, కుంతల గూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ కూలీల మీదకి ట్రాక్టర్ దూసుకెల్లడం జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి .
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మద్యం సేవించి ట్రాక్టర్ నడపడం వలనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
